బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తున్న బిగ్బాస్ కార్యక్రమము చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరగబోతుందో అన్నది కూడా అటు ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది. ఇకపోతే ఇటీవల బిగ్బాస్ హౌస్ నుంచి ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపుగా టాప్ త్రీ లో నిలుస్తాడు అనుకున్న యాంకర్ రవి  ఉన్నఫలంగా ఎలిమినేట్ కావడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు అందరు. దీంతో ఇక బిగ్ బాస్ ఓటింగ్ నిజమేనా అన్న అనుమానం కూడా అందరిలో మొదలైంది.


 ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో రవి కంటే ఎక్కువ వీక్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్ కావడం ఫై మాత్రం అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి రవి ని ఎలివేట్ చేయడానికి అతడు ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకోవడమే కారణం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ ల కంటే యాంకర్ రవి కి ఎక్కువ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారట. అయితే ఇటీవలే దీనికి సంబంధించిన టాక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 దాదాపు యాంకర్ రవి కి వారానికి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకూ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే యాంకర్ రవి 12 వారాలకు ఏకంగా 90 లక్షల రూపాయల వరకు వెనకేసుకున్నాడట. ఇలా బిగ్ బాస్ హౌస్ లో రెమ్యునరేషన్ ఎక్కువ గా తీసుకున్నాడు అన్న కారణంగానే రవి స్ట్రాంగ్  కంటెస్టెంట్ అయినప్పటికీ రవి ఇంటి నుంచి బయటకు పంపించారు అనే విషయం బయటపడింది అంటూ అసలు వినిపిస్తున్నాయి. అయితే రవి 12 వారాలకు పొందిన 90 లక్షల రూపాయలు ఏకంగా ప్రైస్ మని 50 లక్షల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో ముగింపుకు వచ్చిన తర్వాత ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చిన రవిని హౌస్లో కొనసాగించడం అవసరం లేదని బిగ్ బాస్ నిర్వాహకులు భావించినట్లు ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక లేడీ కంటెస్టెంట్ ఫినాలే కు పంపించాలని కూడా నిర్వాహకులు బలంగా ఫిక్స్ అయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజం అది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: