పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' సంక్రాంతికి విడుదల కాబోతున్న తెలుగు సినిమాలలో ఒకటి. ప్రమోషనల్ స్టంట్స్, అప్‌డేట్స్‌తో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటికే ఈ సినిమా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో సినిమాటోగ్రాఫర్ సినిమా మధ్యలో తప్పుకోవడం, కరోనా ఎఫెక్ట్, బడ్జెట్ ప్రాబ్లెమ్స్ అంటూ పలు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో 'భీమ్లా నాయక్' ను వాయిదా వేసుకోవాలంటూ 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' మేకర్స్ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ వార్తలు రావడం, అయినప్పటికీ తగ్గేదే లే అంటూ నిర్మాతలు అప్డేట్స్ విడుదల చేయడం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని పుకార్లు నడుస్తుంటే, మరోవైపు నిర్మాతలు సినిమా విడుదల విషయం గురించి చర్చలు జరుపుతున్నారు. అయితే ఇన్ని సమస్యలను పెట్టుకుని విడుదలకు సిద్ధమవుతున్న 'భీమ్లా నాయక్' మరి ఇప్పుడు రానున్న అతిపెద్ద సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నాడు ? అనే చర్చ జరుగుతోంది.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ ఇప్పటి కే ప్రపంచం అల్లకల్లోలం అయిపొయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమపై మరోసారి పంజా విసరడానికి కరోనా సెకండ్ వేవ్ సిద్ధమైపోయింది. అందులనూ ఒమిక్రాన్ అంటూ మరో కొత్త వైరస్ పడగ విప్పింది. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అలజడి మొదలైంది. మరి ఈ క్రమం లో సినిమాలు రిలీజ్ అవుతాయా? అయితే పరిస్థితి ఏంటి? మరోమారు లాక్ డౌన్ పడుతుందా ? అనేది వేచి చూడాలి. ఒకవేళ మళ్ళీ లాక్ డౌన్ గనుక వచ్చిందంటే సినిమాలన్నీ మరికొన్ని రోజులు మూలాన పడక తప్పదు. అయితే ఈసారి ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తం అయ్యాయి కాబట్టి ఆ పరిస్థితి రాకూడదని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: