తెలుగు సినిమా పరిశ్రమని ఎప్పటికప్పుడు సరికొత్త దనంతో ముందుకు తీసుకురావాలని పాకులాడే హీరోలలో ముందు వరుసలో ఉంటాడు హీరో కళ్యాణ్ రామ్. ఈయన సినిమాలు ఫ్లాప్ హిట్ అనే సంబంధం లేకుండా విడుదల చేస్తూ ఉంటారు. కొత్త కథ నచ్చితే చాలు కచ్చితంగా ఆయన సినిమాని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనొక్కడే సినిమా తో ప్రారంభించి పటాస్ వంటి విషయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ రామ్.

అయితే తాజాగా ఈ నటుడి నుంచి బింబిసార అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుండి కొద్ది నిమిషాల క్రితమే ఒక టీజర్ కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ చాలా మాస్ లుక్ లో, భయంకరంగా ఉన్నాడు. ఇక ఈ మూవీలోని విజువల్స్, వాయిస్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని కనిపించే టువంటి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.

ఇక కొత్త దర్శకుడు అయినటువంటి విశిష్ట కూడా చాలా అనుభవం ఉన్న డైరెక్టర్గా మాదిరి తెరకెక్కించారని ఈ టీజర్ చూస్తే కనిపిస్తోంది. బింబిసార రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చిన కొంతమంది దుండగులకు ఖడ్గం చూస్తే భయపడేలా టీజర్ని తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశానికి ప్రాణం పోసి నటించాడని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నెత్తుటి మరకలు తో కనిపించడం ఈ టీజర్కి హైలెట్ గా నిలుస్తోంది.

ఇక ఈ టీజర్ని కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కళ్యాణ్ రామ్ఈ సినిమాలో సరి కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు కని పించిన కళ్యాణ్ రామ్ పేరు ఈ సినిమాలో కనిపించే బింబిసార పాత్ర వేరు అన్నట్లుగా నటించారు. ఇక ఈ మూవీ కూడా నిర్మాతగా కళ్యాణ్ రామ్ నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: