దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిన ఈ సినిమా లో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటిస్తుండగా అజయ్ దేవ్ గన్, సముద్రకని ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపించబోతుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర లో కనిపించ బోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర పనులు దాదాపుగా ముగియడంతో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫిషియల్ గా ప్రకటించింది.

ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల జోరు పెంచింది, ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన చిత్ర బృందం, ఆ తర్వాత కొంత కాలానికి దోస్తీ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసింది, కొన్ని రోజుల క్రితమే నాటు  నాటు సాంగ్, అలాగే ఈ మధ్యే నే జనని అనే పాట ను కూడా విడుదల చేసి ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత గా పెంచింది. అయితే తాజా గా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజు ల్లో ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ దాదా పుగా మూడు నిమిషాల నిడివి కలిగి ఉండనునట్లు తెలుస్తోంది, ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మూడు గంటల నిడివి కంటే ఎక్కువ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: