టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దగ్గుబాటి రామానాయుడు మంచి మంచి సినిమాలను నిర్మించి..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆయన వారసులు దగ్గుబాటి సురేష్ బాబు, విక్టరి వెంకటేష్ ఇద్దరు సినిమా రంగంలో సక్సెస్ అవ్వడం విశేషం. నిర్మాతగా సురేష్ బాబు.. సీనియర్ హీరోగా వెంకటేష్ ఇద్దరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో వెంకటేష్ కొడుకు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు మారుమ్రోగిపోతున్నాయి.

ఇక విక్టరి వెంకటేష్ ఈ వయసులోను యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తూ..తానేంటో ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. మొన్న ఆ మధ్య వచ్చిన వెంకటేష్ నటించిన "నారప్ప" సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 2 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇక వెంకీ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరెక్షన్ లో  ‘ఎఫ్3’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా సెకండ్ హీరో గా నటిస్తుండడం గమనార్హం.

ఇప్పటికే  ఈ కాంబినేషన్ లో వచ్చిన "ఎఫ్2" మూవీ బాక్స్ ఆఫిస్ దగ్గర భారీ వసూలు రాబట్టింది. దీంతో ఈ సినిమా పై మరింతగా అభిమానులు అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాను 2022 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇవే కాదు వెంకీ ఇంకో  మూడు సినిమాల్ని లైన్ లో పెట్టిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇలా వరుస సక్సెస్ మీద ఉన్న వెంకటేష్.. కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. విక్టరి వెంకటేష్ హార్స్ రేసింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యిన్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి.

వెంకీకి ఓ గుర్రం ఉంది.  దాన్ని అక్షయ్ కుమార్ అనే జాకీ రైడ్ చేస్తూ ఉంటారట. హైదరాబాద్ రేసింగ్ క్లబ్ కు చెందిన ఆ థండర్ రోడ్ అనే గుర్రం.. ఇటీవల మలక్‌పేట్ రేస్ క్లబ్ లో జరిగిన హార్స్ రేసింగ్ లో  విన్నర్ గా నిలిచిందంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని పై ఎప్పటి నుండో కన్నేసిన వెంకటేష్ ఫ్యూచర్ లో ఈ బిజినెస్ లో ఇంకా ఇన్వాల్వ్ కావాలి అనుకుంటున్నారట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్  ఏమిటంటే.. హైదరాబాబ్ రేసింగ్ క్లబ్ ఫౌండర్ అయిన సురేంద్రరెడ్డి మనవడు స్వయానా వెంకటేశ్ కి అల్లుడు. సో దీని వల్లే వెంకీ  కీ ఈ హార్స్ రేసింగ్ బిజినెస్ లో కి వెళ్లాలి అనే ఆలోచన వచ్చిన్నట్లు ఉంది ఏమో అంటున్నారు అభిమానులు. మరి చూడాలి వెంకీ ఈ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: