మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసినప్పటికీ ఎవరితో పోటీ లేకుండా సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆచార్య సినిమాను  ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయడం అంటే చాలా రిస్క్ అని భావిస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల, సినిమాలను చూడడానికి వచ్చే పరిస్థితులు ఉండవు.  అందు వలన సినిమా కలెక్షన్ల పై ఆ ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ హీరోల సినిమాలను మరియు క్రేజ్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఫిబ్రవరి నెలలో మరియు మార్చి నెలలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించరు.

 ఆ తర్వాత ఏప్రిల్, మే నెలలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పోయిన సంవత్సరం ఉప్పెన సినిమాను ఫిబ్రవరి నెలలోనే విడుదల చేశారు.  కాకపోతే పోయిన సంవత్సరం కరోనా వల్ల పరీక్షలు లేకపోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ప్రస్తుత సంవత్సరం మాత్రం విద్యార్థులకు స్కూల్స్, కాలేజీలు నడుస్తున్నాయి. దాని వలన ఆచార్య సినిమా కలెక్షన్ లపై ప్రభావం పడుతుందని కొంతమంది భావిస్తున్నారు. కాకపోతే కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన మిర్చి సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల అయి బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా, కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి అదే సీన్ మరొక సారి ఆచార్య సినిమా విషయం లో రిపీట్ అవుతుందో.. లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: