ఇక రీసెంట్ గా బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ యంగ్ హీరో రాజ్‌తరుణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన మూవీ.. "అనుభవించు రాజా". రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అరియానా కూడా ఓ కీలక పాత్ర లో నటించింది. ఇక రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా రాజ్ తరుణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అరియానా కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ మారాయి.
ఆ ఇంటర్వ్యుల్లో అరియానా మాట్లాడుతూ.." అసలు నిజం చెప్పాలంటే.. హీరో రాజ్ తరుణ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆయన అంటే నాకు నచ్చాదు.. ఎప్పుడైన ఇంట్లో టీవీ చూస్తుంటే ఆయన సినిమాలు వస్తే వెంటనే ఛానల్ మార్చేసేదాని. ఇంకా చెప్పాలంటే ఆయనకు యాక్సిడెంట్ జరిగి కాలో, చెయ్యో విరిగిపోవాలి అనుకున్నా" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో అసలు ఎందుకని రాజ్ తరుణ్ అంటే అంత అసహ్యమని అడగ్గా.. అరియానా రిప్లై ఇస్తూ.."ఆయన నన్ను చాలా సార్లు బాధ పెట్టారు. ఇంటర్వ్యూకి పిలిచి చాలా సేపు వేయిట్ చేయించి .. ఫైనల్ గా నాకు ఇంటర్వ్యు ఇవ్వకుండానే..నా ముందే కారులో వెళ్ళిపోయారు..ఇలా రెండు మూడు సార్లు చేసారు. దీంతో ఆయన అంటే నాకు అసహ్యం వచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చింది.