కానీ ఇటీవలే ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ గా ఉన్న యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం మాత్రం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. టాప్ త్రీ లో కొనసాగుతాడు అనుకున్న యాంకర్ రవి ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో పాపులారిటీ ఉన్న రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అన్నది మాత్రం ప్రస్తుతం బుల్లితెర పై జరుగుతున్న చర్చ. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ వచ్చినా రవి చివరికి ఎలిమినేట్ అయిపోయాడు.
అయితే రవి ఎలిమినేట్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం రవి కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీలలో బాగా పాపులారిటీ ఉంది కూడా యాంకర్ రవి కె. దీంతో రవి ఎంతో సులభంగా టాప్ 5 లోకి వెళ్తాడు అని భావించి ఎంతో మంది రవి కి ఓటు వేయకుండా మిగతా కంటెస్టెంట్ కి ఓటు వేయడం ప్రారంభించారట.. ఫ్యాన్స్ బేస్ తక్కువగా ఉన్న వారిని సేవ్ చేయడం కోసం ఎంతోమంది ఓటు వేశారట. ఇలా రవి కి ఎలాగో ఓట్లు వస్తాయని భావించి వేరే వాళ్ళకు ఓట్లు వేయడమే రవికి మైనస్ గా మారింది అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇదే రవి ఎలిమినేషన్ కు ప్రధాన కారణం అయి ఉండవచ్చు అనిఅభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.