వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని 2021 వ సంవత్సరం వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించగా కరోనా కారణంగా ఈ చిత్రం ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మరో హీరో వరుణ్ తేజ్. వరుస విజయాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మెగా హీరో. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ కథల ఎంపికలో మిగతా వారి కంటే కొత్తదనం చూపిస్తూ స్టార్ హీరోగా ఎదగుతు దూసుకుపోతున్నాడు. మొదట్లో ఆయన కథల విషయంలో పొరపాట్లు పడ్డా కూడా వాటి నుంచి ఎంతో నేర్చుకుని ఆ తర్వాత మంచి సినిమాలను కొత్తరకం కథలను ఎంచుకోవడం తో ఆయనను విజయాలు వరించాయి. 

తద్వారా ప్రేక్షకుల వద్ద మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన 2019 లో హరీష్ శంకర్ దర్శకత్వం లో చేసిన గద్దలకొండ గణేష్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా అంతటి పెద్ద స్థాయి లో హిట్ కొట్టిన తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ఈ చిత్రం పై భారీ అంచనాలను పెంచగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతుండడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ లో పంచ్ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్సినిమా తో ఎలాంటి హిట్ అందులోబోతున్నాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: