నందమూరి హీరోలలో
బాలకృష్ణ మరియు
ఎన్టీఆర్ ల తర్వాత అంతటి స్థాయిలో కాకపోయినా కొంత ఇమేజ్ తో నెట్టుకొస్తున్నాడు ఓ హీరో. వరుస మంచి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు. అపజయం వచ్చినా విజయం వచ్చిన ఏ మాత్రం తొనకకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. ఆయనే హీరో కళ్యాణ్ రామ్. తొలి
సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతి ఒక్క
జోనర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తమ్ముడు
ఎన్టీఆర్ లా స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.
సొంత నిర్మాణ సంస్థ పై సినిమాలు చేస్తూ ఇప్పటివరకు ఆయన సొంత బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ
సినిమా పట్ల తనకున్న పాషన్ ను చాటి చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఆయన తీసిన చిత్రాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ లే ఉన్నాయని చెప్పవచ్చు. కథ కథనం కొత్తగా ఉండేలా ఆలోచించే
కళ్యాణ్ రామ్ ఏదో ఒక విషయంలో పొరపాటు చేయడం వల్ల ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు సైతం ఫ్లాప్ లుగా మలచుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఆయన మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఓ నూతన దర్శకుడు తో కలిసి బీంబిసారా అనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఆయన చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు విడుదల కాగా చారిత్రాత్మక మైన లుక్ లో
కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తూ తప్పకుండా ఈ సినిమాతో హిట్ కొట్టెలా చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఓకే రకమైన
జోనర్ లో చూసిన వారు ఇప్పుడు ఈ చారిత్రాత్మక గెటప్ లో ఆయనను చూసి రిఫ్రెష్ ఫీల్ అవుతున్నారు. అంతే కాదు
కళ్యాణ్ రామ్ ను పెట్టి ఇంత భారీ బడ్జెట్ తో
సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో
నిర్మాత గా కూడా
కళ్యాణ్ రామ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అనేది ఇంకా ప్రకటించలేదు.