యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగా మనకు గుర్తొచ్చేది బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి గారు ది బిగినింగ్,మరియు కంక్లూజన్. రెండు భాగాలుగా విడుదల చేశారు. బాహుబలి 2 ది కన్ క్లూజన్ అనే చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రేక్షకులు అందరికి తెలుసు. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా తెలుగు పరిశ్రమలో చెబుతూ ఉంటారు. ఈ రెండు సినిమాలకు గాను 250 కోట్లు ఖర్చు పెట్టగా 1607 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. బాహుబలి2 విడుదలైన ఒక మొదటిరోజే 200 కోట్లు వసూలు చేసి రికార్డు గా నిలిచింది.

ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం రాదే శ్యాం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగు,హిందీ,కన్నడ,తమిళం,మలయాళం వంటి భాషల్లో నిర్మిస్తున్నారు. 350 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదలకు సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసినదే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రజలలో భారీ అంచనాలను కలిగించింది.

 
కాగా ఇప్పుడు దేశంలో అక్కడక్కడా పెరుగుతున్న కరోనా వైరస్సినిమా ప్రొడ్యూసర్ మరియు చిత్రయూనిట్ను కలవరపెడుతుంది. ఇంత భారీ పెట్టుబడులతో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సమయంలో లో కరోనా మూడవ వేవ్ అని ప్రచారంలో ఉన్న ఒక వార్త కలవరపెడుతుంది. 2022 జనవరి 14 నా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం. 2019 లో  సాహో తర్వాత, ప్రభాస్ చేసిన మరొక చిత్రం ఇది. ఈ పరిస్థితులలో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ చేస్తున్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: