కరోనా వైరస్ రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రజలను ముప్పతిప్పలు పెట్టింది. ఎందరో రోడ్డున పడటానికి కారణమయ్యింది. ఈ మహమ్మారి ఉదృతి ఇప్పుడు తక్కువైనప్పటికీ ఇది సృష్టించిన భీభత్సాన్ని మాత్రం అస్సలు మరువలేము. ఇక ఇక కరోనా కష్ట సమయంలో ప్రధానంగా సినీ ఇండస్ట్రీ కూడా ఆర్థికంగా కుదేలు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ సమస్యల నుంచి బయటపడుతోంది. అయితే రానున్న రోజుల్లో మళ్ళీ కరోనా ముప్పు తప్పేలా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరిలో మళ్ళీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని పలువురు వైద్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ మరిన్ని రూపాంతరాలు చెందే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. పోయిన సారి ఏకంగా ఏడాది పైనే లాక్ డౌన్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ నెలలు తరబడి వెయిట్ చేయలేక ఓటిటి బాట పడ్డాయి. మేకర్స్ వచ్చిందే గొప్ప దేవుడా అనుకుంటూ లాభం దేవుడెరుగు కనీసం నష్టాలు లేకపోతే చాలు అనుకుని ఓటిటిలు ఇచ్చింది తీసుకుని సర్దుకున్నారు. అయితే ఇపుడు మళ్ళీ జనవరిలో కరోనా మూడవ దశ  మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో మళ్ళీ సినీ పరిశ్రమకు కష్టాలు తప్పేలా లేవు.

అందులోనూ అది సంక్రాంతి పండుగ సీజన్ ఈ టైం లో ఎక్కువగా అగ్ర హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలాంటిది ఈ సారి కూడా భారీ ప్రాజెక్టులు వరుసగా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న భయం అందరిలోనూ కనబడుతోంది. అదీకాక గత రెండు, మూడు రోజుల నుండి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న వైనం అందరినీ కలవరపెడుతోంది. ఇటు అభిమానులు కూడా ఆందోళన  చెందుతున్నారు. మరి రానున్న రోజుల్లో పరిస్థితి కుదుటపడుతుందా? లేదా ఇంకా దారుణంగా తయారవుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: