సినిమా పరిశ్రమకు సంక్రాంతి అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇంకో ముప్పై రోజులు పోతే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. సంక్రాంతి రైతులకే కాదు సినీ పరిశ్రమకి కూడా పెద్ద పండుగే. పెద్ద పండుగ వస్తుంది అంటే ముఖ్యంగా మన అగ్ర తారల చిత్రాలు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంటాయి. చిన్న చితక చిత్రాలు కూడా పండగ రోజున లాభాల వాటాను పంచుకునేందుకు రేసులో రెడీగా ఉంటాయి. అయితే పోయిన ఏడాది మాత్రం అటు సినీ ప్రియులకు ఇటు సినీ ముద్దు బిడ్డలకు ఇరువురికి నిరాశే మిగిలింది. కరోనా దెబ్బతో థియేటర్లన్నీ మూతపడడంతో సినీ పరిశ్రమను నమ్ముకున్న ఎందరో ఆర్థికంగా నష్టపోయారు.

అయితే కరోనా తగ్గింది కదా అని సినీ ప్రపంచం ఉరకలు వేస్తోంది. అరడజను పైగానే బడా భారీ ప్రాజెక్టులు ఈ సంక్రాంతి మరియు వేసవి వెకేషన్ కు రిలీజ్ అయ్యి కలెక్షన్ ను కురిపించేందుకు రెడీ అవుతున్నాయి. మరోవైపు యంగ్ హీరోల సినిమాలు కూడా పదికి పైనే ఉన్నాయి. ఇలా ఈ సారి సంక్రాంతి పండుగ మొదలుకుని వరుస పెట్టి సినిమాలు సందడి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్న తరుణంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా  పాజిటివ్ కేసులు సినీ ప్రపంచాన్ని సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ లేట్ అయినా బిగ్ మూవీస్ ఇంకా ఆలస్యం  చేస్తే అసలుకే మోసం...చిన్న చిత్రాల కేమో థియేటర్స్ లేకపోయినా మరో ఆప్షన్ గా ఓటీటీ వేదిక ఎలాగో ఉండనే ఉంది. మరి భారీ బడ్జెట్ చిత్రాలకు డిజిటల్ రంగం ఆ స్థాయిలో పైకం చెల్లిస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. జనవరిలో థర్డ్ వేవ్ అంటూ మరో పిడుగు లాంటి వార్తకు ఇపుడు కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటం తో ముప్పు తప్పేలా లేదని అనిపిస్తోంది...ఇది సినీ పరిశ్రమకే కాదు ప్రజలందరికీ ఆందోళన కలిగించే అంశమే. మరోవైపు ఈ భారీ వర్షాలు ... అన్ని సమస్యలు సర్దు మనిగి మళ్ళీ అంతా స్వేచ్చగా సంతోషంగా జీవించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: