టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా చిరంజీవి అలాగే బాలకృష్ణ, నాగార్జునలకు పేరుందని తెలుస్తుంది.ఈ హీరోలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందనే విషయం అందరికి తెలిసిందే.

అయితే ఒకే నెలలో ఈ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కాగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయట.. ఆ తరువాత నెలలో విడుదలైన రాజశేఖర్ నటించిన సినిమా మాత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని సమాచారం.

కొన్నేళ్ల క్రితం వరకు హీరో రాజశేఖర్ ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలలో నటించారట.ఆ సినిమాలతో రాజశేఖర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.2001 సంవత్సరంలో నాగార్జున నటించిన బావనచ్చాడు సినిమా జూన్ నెల 7వ తేదీన విడుదలైందట.ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది.. ఆ తర్వాత వారం జూన్ నెల 15వ తేదీన బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసు సినిమా విడుదలైందని తెలుస్తుంది.

భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైందని తెలుస్తుంది.

ఆ తర్వాత వారం చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమా విడుదలైందట.శ్రీ మంజునాథ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని ఇలా ఒకే నెలలో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరచడం విశేషం.
అయితే ఆ తర్వాత నెలలో రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమా జులై నెల 6వ తేదీన విడుదలైందని తెలుస్తుంది.సింహరాశి సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందట.. రాజశేఖర్ మార్కెట్ ను పెంచిన సినిమాలలో సింహరాశి ఒకటని తెలుస్తుంది.రాజశేఖర్ కు జోడీగా ఈ సినిమాలో సాక్షి శివానంద్ నటించారని బయ్యర్లకు ఈ సినిమా భారీ మొత్తంలో లాభాలను అందించిందని తెలుస్తుంది.దీనితో రాజశేఖర్ కు అవకాశాల వెల్లువ మొదలైందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: