మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను వ్రాసే మాటలను చాల పొదుపుగా మాట్లాడుతాడు. తాను తీసే సినిమాల ఖర్చు విషయంలో ఏమాత్రం పొదుపు సూత్రం పాటించని త్రివిక్రమ్ ఈమధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ చేసాడు అంటూ జరిగిన చర్చలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాస్తవానికి ఆ కామెంట్స్ త్రివిక్రమ్ చేయలేదు.



అతడి పేరు మీద ఎవరో ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని త్రివిక్రమ్ అభిప్రాయంగా కలర్ ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ లో పేరు గాంచిన హాస్పటల్స్ అదేవిధంగా పేరుగాంచిన వివిధ విద్యా సంస్థలు ఒకొక్కరు ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తుంటే సినిమా ధియేటర్లు టిక్కెట్లు మటుకు ఒకేరేటులో ఎందుకు అంటూ ఈ అభిప్రాయం త్రివిక్రమ్ ది అంటూ ప్రచారం జరిగింది.


ఆ కామెంట్స్ త్రివిక్రమ్ దృష్టి వరకు రావడంతో అతడు వాటిని ఖండించాడు. అయితే వాస్తవానికి ఈ అభిప్రాయాలు త్రివిక్రమ్ మాటలు కానప్పటికీ ఈ అభిప్రాయాల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సినిమా ధియేటర్లు ప్రవేటు రంగం కాబట్టి టిక్కెట్ల రేట్ల పై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.



అయితే ఈ చర్చలలోని అంశాలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. దీనికి కారణాలు అనేకం అయినప్పటికీ టాప్ హీరోల సినిమాల బిజినెస్ సుమారు రెండువేల కోట్ల వరకు జరిగిన పరిస్థితులలో టాప్ హీరోల సినిమాలను అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు మాత్రం సంక్రాంతి సీజన్ లో కూడ తమకు నష్టాలు తప్పవా అంటూ తెగ మధన పడుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈసమస్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది అయినప్పటికీ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు తప్ప ఈ సమస్య పై ఇప్పటి వరకు చిన్న నిర్మాతలు చిన్న హీరోలు మాట్లాడక పోవడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం లేదు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: