ఆరీయానాకి ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే ఏమాత్రం నచ్చేది కాదట. రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అనుభవించు రాజా మూవీ ప్రేక్షకుల ముందుకు విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్లలో ఆరీయానా మాట్లాడుతూ.. అందుకు గల కారణాన్ని తెలిపింది. నాకు వాస్తవానికి రాజ్ తరుణ్ అంటే ఒకప్పుడు అసలు ఇష్టం లేదని.. ఈ హీరో సినిమా టీవీలో వస్తే చాలు తీసేయమని అనేదాని తెలిపింది. ఒకానొక సమయంలో ఈయన కారులో వెళ్తుంటే ఆయనకి యాక్సిడెంట్ కావాలని కోరుకున్నానని అని తెలిపింది.
ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ కోసం నన్ను పిలిచి ఉదయం నుంచి మధ్యాహ్నం 2:00 అయినా ఎవరూ రాకపోవడంతో అలా అనిపించింది అని, కానీ వాస్తవానికి ఈ విషయంలో రాజ్ తరుణ్ కు సంబంధం లేదని నాకు తెలిసింది. అలా ఎంతసేపు వెయిట్ చేశాను. కానీ రాజ్ తరుణ్ నా కళ్ళముందే కార్లో వెళ్ళిపోయారు. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తి ని అడిగితే సార్ సినిమా డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నారని తెలియజేశారు.
ఇక జీవితంలో రాజ్ తరుణ్ తో మాట్లాడకూడదని అనుకున్నాను. అలా అంతటి కోపాన్ని పెట్టుకున్న నేను నా మొదటి సినిమా తనతోనే నటించే అవకాశం రావడంతో నేను షాక్ అయ్యాను అని తెలిపింది. నాకు నచ్చని వ్యక్తితో సినిమా ఏంటి అని ఆలోచించాను. కానీ నేను ఈ సినిమాలో కనిపించేది కేవలం కొన్ని నిమిషాలు కదా అని ఓకే చేశాను అని తెలిపింది. తరువాత మేమిద్దరం రెండు రోజులకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పుకొచ్చింది.