గతంలో నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసి సినిమాలు చేయడం అనేది పెద్దగా జరిగే పని కాదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కి మధ్య కనపడని దూరం ఉందని చాలామంది వ్యాఖ్యలు చేసినా సరే చిరంజీవి అలాగే బాలకృష్ణ ఎదురు సన్నిహితంగానే ఉంటారు అని సినీ వర్గాలు చెబుతూ వచ్చేవి. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా ఇద్దరు మాత్రం బయట బాగానే ఉన్నా లోపల మాత్రం ఇద్దరిలో తెలియని గ్యాప్ ఉంది అనేది కొంతమంది ప్రచారం చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తుందనే ప్రచారం కాస్త ఎక్కువగా జరుగుతోంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీకి అలాగే నందమూరి ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ పెరిగిందని ఈ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఎదుర్కోవడానికి కాస్త ఎక్కువగా కష్టపడటం కాకుండా ప్రకాష్ రాజ్ ని అన్ని విధాలుగా ప్రమోట్ చేయడం అలాగే మంచు విష్ణు విషయంలో కాస్త టార్గెట్ చేసినట్టు గా వ్యవహరించడం వంటివి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చాయి.

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీ లో కీలక వ్యక్తిగా భావించిన అల్లు అరవింద్ నందమూరి కుటుంబంతో దగ్గర కావడానికి నందమూరి బాలకృష్ణతో ఒక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసి విడుదల చేశారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ తో కలిసి నందమూరి బాలకృష్ణతో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని దీనికి సంబంధించి బాలీవుడ్ నిర్మాత కూడా అయిన పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సినిమాలో బాలకృష్ణ కొడుకు కూడా కనపడే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: