మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ నేపథ్యంలోనే ఒక చిన్న సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సాయిధరమ్ తేజ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ తో కలిసి వరుణ్ తేజ్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ కూడా సిద్ధం చేశారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయవచ్చని అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి వరుణ్ తేజ ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను ఒక టీం కి అప్పగించారని ఒక మీడియా సంస్థ దీనికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతుందని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే తెలియకపోయినా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు వరుణ్ తేజ్ కాస్త ప్లాన్ చేస్తున్నాడని దీనికి సంబంధించి దర్శకుడు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సాయి ధరమ్ తేజ్ కూడా అప్పుడే ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.