వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఏకంగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సమంత. బాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే సమంతాకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా వచ్చింది. ఆ పాత్రకు సమంత ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఏకంగా బైసెక్సువల్ పాత్రలో నటించేందుకు కూడా సమంత ఒప్పుకొంది.
సమంత తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ హాలీవుడ్ మూవీ లో బైసెక్సువల్ పాత్రకు సమంత ఓకే చెప్పడం గమనార్హం. అయితే ఈ పాత్ర సమంత సరిపోతుందని సూచించింది హీరో రానా అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు పడుతుంది. బిసెక్సువల్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అని మేకర్స్ ఆలోచిస్తున్న సమయంలో ఆ పాత్రకు సమంత అయితే పూర్తి న్యాయం చేస్తుందని రానా సలహా ఇచ్చినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్ర బృందం ఇక సమంత ను సంప్రదించగా సమంత కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. సమంత తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక హీరో రానా ఉన్నాడు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.