కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా దూసుకుపోతున్న సూర్య కి మన తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో సూర్య రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇటీవల సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి 'జై భీమ్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 1995 లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

 ఎంతో సహజంగా వైవిధ్యభరితంగా ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కుంటోంది. ఈ సినిమాని జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. సినిమాలో సూర్య చంద్రు అనే పాత్రలో నటించారు. ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం తో పాటు భారీ రికార్డులను సైతం నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ  జాబితాలో ఏకంగా నంబర్ వన్ ప్లేస్ ని సొంతం చేసుకుని వండర్ ని క్రియేట్ చేసింది. సుమారు 9.6 రేటింగ్స్ తో ఏకంగా 53000 ఓట్లు అందుకొని ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

దళిత వర్గానికి చెందిన కొందరిపై పోలీసులు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారంటూ అనే కథాంశంతో ఈ సినిమాని హీరో సూర్య తో పాటు తన భార్య జ్యోతిక కలిసి నిర్మించారు. ఇక కేవలం ప్రేక్షకులే మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. జై భీమ్.. విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్ వేదికగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్ ని అందించనున్నారు. ఇక అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో  ఆస్కార్ అవార్డ్స్ తర్వాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. దీంతో జై భీమ్ ఈ అవార్డు కి ఎంపిక కావడంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: