తెలుగు సినీ పాట‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత తీసుకొచ్చిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మూడు వేల‌కు పైగా పాట‌లు రాసారు. 2019లో ప‌ద్మ శ్రీ అవార్డును ద‌క్కించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లో దోస్తి పాట‌ను కూడా రాసాడు. కే.విశ్వ‌నాథ్ చిత్రాల‌లో ప్ర‌ఖ్యాతి గాంచారు సిరివెన్నెల‌. 11 నంది అవార్డులు, 4 ఫిలిం ఫెయిర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. సిరివెన్నెల అస‌లు పేరు చెంబోలు సీతారామ శాస్త్రీ. 1955 మే 20న విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా అన‌కాప‌ల్లి మండ‌లంలో డాక్ట‌ర్ సీవీ యోగి, సుబ్బ‌ల‌క్ష్మి దంప‌తుల‌కు జ‌న్మించారు. వీరిది దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అన‌కాప‌ల్లిలోనే చదివారు సిరివెన్నెల‌.

సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చినది కళాతపస్వి కె.విశ్వనాథ్ సిరివెన్నెల చిత్రం.  సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ క‌ల‌రు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు సిరివెన్నెల. తొలుత భ‌ర‌ణి పేరుతో క‌విత‌లు రాసారు సిరివెన్నెల. ఆ త‌రువాత గంగావ‌త‌ర‌ణం క‌విత చూసి సిరివెన్నెల చిత్రంలో పాటు రాసే అవ‌కాశం కల్పించారు విశ్వ‌నాథ్‌. సుమారు 3 వేలకుపైగా పాటలు రాసారు సీతారామశాస్త్రి. దాదాపు 165కుపైగా చిత్రాలకు పాటలు రాసారు సిరివెన్నెల‌.

మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించి త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా 2019లో భార‌త‌దేశ పుర‌స్కార‌మైన ప‌ద్మ శ్రీ అందుకున్నారు. సిరివెన్నెల పాటలు రాసిన చిత్రాలు సిరివెన్నెల, స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం, గులాబీ, మని, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీ పుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, శుభ సంకల్పం, పట్టుదల, మనసులో మాట, పవిత్ర బందం, భారతర్న, నువ్వు వస్తావని, నువ్వే కావాలి, చక్రం, గమ్యం, మహాత్మ, కిక్, అలా ఎలా, దేవదాస్, అల వైకుంఠపురములో, రంగమార్తాండ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల‌లో పాటలు రాయ‌డంతో పాటు  గాయం సినిమాలో న‌టించాడు కూడా. 11 నంది అవార్డుల‌ను అందుకున్న ఏకైక ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. వేటూరి త‌రువాత కావ్య గౌర‌వం తీసుకొచ్చారు సిరివెన్నెల‌. జ‌న‌నీ జ‌న్మ‌భూమిలో తొలిపాట రాసారు. సిరివెన్నెల ఆర్ఆర్ఆర్‌లో దోస్తీ పాట త‌న చివ‌రి పాట అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: