సినిమా పరిశ్రమలో కళామతల్లిని నమ్ముకుని ఆమె నీడన ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. ఒక సినిమా తయారు కావాలంటే ఎంతో మంది కలిసి పనిచేస్తేనే కుదురుతుంది. అందులో ఒకటే సంగీతం మరియు పాటలు. ఒక మనిషిని ప్రభావితం చేయడానికి సంగీతం అనేది ఒక సాధనం అని చెప్పాలి. అలాంటి సంగీతానికి ప్రాణమయిన పాటలు ఇంకెంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సంవత్సరాల సినిమా పరిశ్రమలో ఎందరో అద్భుతమైన గీత రచయితలు తమ ప్రస్థానాన్ని చాటారు. ఇప్పటికీ ప్రజల గుండెల్లో వారి పాటలు మోగుతూనే ఉన్నాయి. అటువంటి గొప్ప గీత రచయితలలో స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాలి.

ఈయన సినీ ప్రస్థానంలో ప్రముఖ దర్శకుడు కె విశ్వనాధ్ పాత్ర ఉంది. సినిమాల లోకి ప్రవేశించాక ముందే సిరివెన్నెల ఒక కవిగా అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. కె విశ్వనాధ్ దర్శకుడిగా చేసిన 'సిరివెన్నెల' 1986 వ సంవత్సరంలో విడుదల అయింది. ఈ సినిమా సంగీత ప్రాధాన్యం కలిగిన సినిమా అందుకే ఇందులో పాటలు సంగీతంపై మంచి పట్టున్న వారు రాస్తే బాగుంటాయని భావించిన కె విశ్వనాధ్ సీతారామశాస్త్రిని ఈ సినిమాలో భాగం చేశారు. అలా సిరివెన్నెల సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక ఆ సినిమా నుండి నేటి వరకు మూడు వేల పాటలకు పైగా తన కలం నుండి జాలువారాయి. ప్రతి ఒక్క పాట ఆణిముత్యమే.

అలా మొదలైన సిరివెన్నెల కె విశ్వనాధ్ కాంబినేషన్ చాలా సంవత్సరాలు కొనసాగింది. వీరిద్దరి సినిమా అంటే ప్రేక్షకులకు ఒక చక్కని వినోద విందు అని ఫిక్స్ అయిపోయేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ ఘనవిజయాలు కావడం గమనార్హం. సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం, చిన్నబ్బాయి లాంటి సినిమాలు ఉన్నాయి. నిన్నటి వరకూ కూడా కె విశ్వనాధ్ మరియు సిరివెన్నెల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ వార్త ఆయన మనసును తీవ్రంగా కలచివేస్తుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రపంచాన్ని తన పాటలతో కదిలించిన గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏ లోకాన ఉన్నా తన  ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుందాం.



 

మరింత సమాచారం తెలుసుకోండి: