తెలుగు సినీ పాట‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత తీసుకొచ్చిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత చెంబోలు సీతారామ శాస్త్రీ. కానీ ఆయ‌న‌కు సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చినది కళాతపస్వి కె.విశ్వనాథ్ సిరివెన్నెల చిత్రం. అప్ప‌టి నుంచి సీతారామ‌శాస్త్రి పేరు ఇంటి పేరుగా మారి.. సిరివెన్నెల ఆయ‌న పేరుగా పిలువ‌బ‌డింది.

సిరివెన్నెల పాటలు రాసిన చిత్రాలు సిరివెన్నెల, స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం, గులాబీ, మని, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీ పుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, శుభ సంకల్పం, పట్టుదల, మనసులో మాట, పవిత్ర బందం, భారతర్న, నువ్వు వస్తావని, నువ్వే కావాలి, చక్రం, గమ్యం, మహాత్మ, కిక్, అలా ఎలా, దేవదాస్, అల వైకుంఠపురములో, రంగమార్తాండ, ఆర్ఆర్ఆర్ వంటి దాదాపు 165 చిత్రాల‌లో పాటలు రాసారు. 3వేల‌కు పైగా పాటలు రాసిన ఘ‌న‌త సిరివెన్నెల ద‌క్కించుకున్నాడు.

ముఖ్యంగా చిరంజీవి న‌టించిన రుద్ర‌వీణ సినిమాలో న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయి అనే పాట ఎంతో హిట్ అందుకున్న‌ది. 1988లో వ‌చ్చిన రుద్ర‌వీణ చిత్రంలో సిరివెన్నెల ఈ పాట‌ను రాసారు. ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీత ద‌ర్శ‌కుడు, సిరివెన్నెల సాహిత్యం, ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గానం, కే.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కె.నాగ‌బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు రుద్ర‌వీణ చిత్రానికి. సిరివెన్నెల పేరు విన‌గానే తొలుత క్లిక్ అయ్యే సాంగ్ రుద్ర‌వీణ‌లోని న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయి.. ప్రారంభ‌మ‌య్యే సీక‌ట‌మ్మ సీక‌టి ముచ్చ‌టైన సీక‌టి వెచ్చ‌నైన ఊసుల‌న్ని రెచ్చ‌గొట్టు సీక‌టి అనే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందింది.

అందులో ముఖ్యంగా నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని  క‌న్నులు మూసి మ‌త్తులోన మెత్త‌గ తోసి క‌ల‌లే వ‌ల‌గా విసిరే చీక‌ట్ల‌ను చీక‌ట‌మ్మ సీక‌టి ముచ్చ‌టైన సీక‌టి అనే సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఇప్ప‌టికీ ఎంతో మంది మెగ‌స్టార్‌ అభిమానులు ఈ పాట‌ను వింటుంటారు. ఈ పాట ద‌క్కిన హిట్ అంతా ఇంతా కాదు. అదేవిధంగా  న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయి అని సాగే ఈ పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.  


మరింత సమాచారం తెలుసుకోండి: