తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు  నిమోనియా తో ఇబ్బంది పడుతున్న ఆయన్ని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చేర్పించారు. ఆ రోజు నుంచి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాసకోస సంబంధిత వ్యాధితో తుది శ్వాస విడిచారు 1955 మే 20 నా విశాఖ జిల్లాలోని అనకాపల్లి లో సీతారామశాస్త్రిగారి జన్మించారు. సిరివెన్నెల గారి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంతో ఈయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారింది. సిరివెన్నెల గారి భార్య పద్మావతి ఇద్దరు రాజా, యోగేష్ ఉన్నారు.

 విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మొదట్లో భరణి అనే పేరుతో కవితలు రాసేవారు. ఆ క్రమంలో ని గంగావతరణం అనే కవిత చూసినా దర్శకులు కె.విశ్వనాథ్ ఆయన సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. అక్కడి నుంచి గేయ రచయితగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇక సుమారు మూడున్నర దశాబ్దాల పైగా సినీ పరిశ్రమలో ప్రఖ్యాత రచయిత గా సిరివెన్నెల రాణించారు. ఇక సుమారు 165 చిత్రాలకు పైగా తన పాటలను అందించారు అంతేకాదు సుమారు మూడు వేలకు పైగా పాటలు రాశారు. ఇక రచయితగా ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు.

 ఇక సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను 2019లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం, గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నేపెళ్లాడుతా, సింధూరం, దేవి పుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, శుభ సంకల్పం, పట్టుదల, మనసులో మాట, పవిత్ర బంధం, భారతరత్న, నువ్వొస్తావని, చక్రం, గమ్యం, మహాత్మ, కిక్, అలా ఎలా, దేవదాస్, అల వైకుంఠ పురం లో, రంగమార్తాండ వంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు. అంతేకాకుండా గేయ రచయితగా ఏకంగా 11 నంది పురస్కారాలను గెలుచుకున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: