సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ గారు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఆ చేదు వార్త మరువకముందే ఇండస్ట్రీ లో మరో విషాదం నెలకొంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినీ గేయ రచయితగా ప్రఖ్యాతిగాంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కన్నుమూశారు. ఈనెల 24వ తేదీన న్యూమోనియాతో హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణ వార్త లో ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనని జన్మభూమి' అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు గేయ రచయితగా పరిచయమైన ఆయన..

 సుమారు మూడు వేలకు పైగా పాటలు రాశారు ఎన్నో అవార్డులు అందుకున్నారు.' సిరివెన్నెల' అనే సినిమాలో అన్ని పాటలు రాసి చెంబోలు సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయాడు. తెలుగులో శ్రీ శ్రీ, వేటూరి, ఆత్రేయ, దాశరథి తర్వాత గా ఆ స్థాయిలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అప్పుడెప్పుడో వచ్చిన 'స్వయంకృషి' నుంచి మొదలుకొని ఇప్పటి రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' వరకు కొన్ని వేల పాటలను రాశారు సీతారామశాస్త్రిగారు. మొదట కవితలు రాసే ఆయన తర్వాత గేయ రచయితగా మారారు. అంతేకాకుండా నటుడిగా కూడా మారి రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాయం' సినిమాలో నటించారు.

 ఈ సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని' పాటను రాయడంతో పాటు ఆ పాటలో నటించారు. ఇక తాను రాసిన ఈ పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారం ఇచ్చి సత్కరించింది.తన 37 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 165 చిత్రాలు, మూడు వేలకు పైగా పాటలు రచించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు 2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఈయన్ని సత్కరించింది. తెలుగులో ఏదైనా ప్రత్యేక పాటలు రాయాలి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సీతారామశాస్త్రిగారే. అలాంటి గొప్ప సినీ గేయ రచయిత మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: