సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం అందరిని శోకసముద్రంలో ముంచేసింది. పరిశ్రమకు వరుసగా గొప్పవారు దూరం అవుతుండటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. వీరు లేని సినీ పరిశ్రమకు ఎవరూ సాటిరారు. అలాంటి వారు అరుదుగానే ఉంటారు. అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా ఒకరు. ఆయనకు ఇంటిపేరుగా మారిపోయిన చిత్రం సిరివెన్నెల. దానిని తెరపైకి తెచ్చింది ప్రముఖ దర్శకులు కే.విశ్వనాధ్ గారు. ఆయన చిత్రాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తదనం అంటూ వెర్రి వేషాలు వేస్తూ పరిశ్రమ పేరుకు మచ్చ తెస్తున్న సమయంలో కూడా గొప్పగొప్ప కళాత్మక చిత్రాలు తీస్తూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన దర్శకుడు ఆయన. అలాంటి ఇద్దరు కలిసి చేసిన చిత్రం అద్భుత విజయం సాధించింది, దానికి ఐదు నంది అవార్డులు కూడా వచ్చాయి.

జైపూర్ లో టూరిస్ట్ ప్రదేశానికి దగ్గరలో ఉండే అన్నా చెల్లెల్లు. అన్నగుడ్డివాడైనా కూడా మురళి అద్భుతంగా వాయిస్తూ ఉండే పాత్రలో హీరో(బెనర్జీ). అతడి కళాహృదయాన్ని అర్ధం చేసుకొని దానికి ముగ్దురాలైన పాత్రలో హీరోయిన్(మూన్ మూన్ సేన్). ఆమె టూరిస్ట్ గైడ్ గా ఉంటూ ఒకనాడు హీరో వేణుగానామృతాన్ని విని పులకించిపోతుంది. అంతటితో అతడికి అభిమానిగా మారిపోతుంది. అతడి కోరిక మేరకు ప్రకృతి ని పరిచయం చేస్తుంది. అలా వాళ్ళు దగ్గరవుతారు. అక్కడే మరో హీరోయిన్(సుహాసిని) పాత్ర ప్రవేశిస్తుంది. ఆమె మూగది. అయినా గొప్పగా చిత్రాలను గీయగలదు. ఆమె కూడా మురళి గానానికి ముగ్డురాలవుతుంది. హీరో గైడ్ కు వివాహం చేసుకుంటానని చెప్పడం, ఆమె తన గతం గురించి చెప్పడం లాంటివి జరిగి అది అక్కడితో ఆగిపోతుంది. అనంతరం గైడ్ తాను వేరే వారిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ వివాహ ఏర్పాట్లు చేయడం అప్పుడే ఆమె ఆత్మహత్య చేసుకొని తన కళ్ళను హీరోకు అమర్చాలని లేఖ రాయడం జరుగుతుంది. తన మరణం గురించి హీరో కు తెలియకూడదని కూడా లేఖలో రాస్తుంది. అయినా చివరి క్షణంలో మరణ వార్త తెలుసుకున్న హీరో స్మశానానికి వెళ్లి ఆమె సమాధి వద్ద ఏడుస్తూ ఉండిపోతాడు. తన ప్రాణం పోయిన విషయాన్ని ఎవరు దాచినా తెలిసిపోతుందని చెప్తాడు. ఇలా మంచి ప్రేమకధగా అప్పట్లో ఈ చిత్రం గుర్తింపు పొందింది.

సిరివెన్నెల చిత్రానికి కధ విశ్వనాధ్ గారే రాసుకున్నారు, ఆయనే దర్శకత్వం కూడా వహించారు. చిత్రంలో పాత్రల డైలాగ్స్ మాత్రం సాయినాధ్ తోటపల్లి వ్రాశారు. ఈ చిత్రానికి లిరిక్స్ సీతారామశాస్త్రి గారు అందించారు. సిహెచ్. రామకృష్ణారెడ్డి గారి నిర్మాణసారథ్యంలో 20 మే, 1986లో ఈ చిత్రం తెరకెక్కించారు. కేవి మహదేవన్, హరిప్రసాద్ లు పాటలు పాడారు. సర్వేదమన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్, మీనా, ఎస్కే.మిశ్రో తదితరులు ప్రధాన తారాగణంగా ఉన్నారు. తనదైనశైలిలో కధను తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. దీనితో అప్పట్లో ఈ చిత్రం గొప్ప విజయం సాధించింది. ఆ విజయం సిరివెన్నెల ను సీతారామశాస్త్రి గారికి ఇంటిపేరుగా మార్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: