గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ లోకాన్ని వీడారు. సినిమా పాటలు తనదైన శైలిలో సాహిత్యాన్ని జోడించి కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రచయిత సిరివెన్నెల. ఆయన కలం నుంచి వచ్చిన పాట‌ల‌ను ఎంతో మంది గాయకులు ఆలపించారు. అయితే ఆయన రాసి... ఆయనే పాడిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో తొలి పాట క‌ళ్లు సినిమాలోని తెల్లారింది లెగండోయ్. అసలు సిరివెన్నెల ఈ పాటను ఎందుకు పాడాల్సి వచ్చింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వం లో వచ్చిన సంచలన చిత్రం కళ్ళు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు. ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నె ల సాహిత్యాన్ని సిద్ధంగా ఉంచుకున్నారు . ఆ పాటను విన్న బాలసుబ్రమణ్యం మీరే స్వయంగా ఈ పాట పాడితే బాగుంటుందని సలహా ఇచ్చారట.

దీంతో సిరివెన్నెల మీరు ఉండగా నేను ఎలా పాడతాను అని చెప్పారు అంట. చివరకు బాలసుబ్రమణ్యం ఒత్తిడి చేయడంతో పది సార్లు ప్రాక్టీస్ చేసి ఆ పాటను ఆయనే స్వయంగా పాడారు. ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట ఇప్ప‌ట‌కీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో అలాగే నిలిచి పోయింది. సంవ‌త్స‌రాలు జ‌రుగుతున్నా ఈ పాట ఓ సెన్షేష‌న్‌.

ఈ పాట గురించి ఓ సందర్భంలో ప్రస్తావించిన సిరివెన్నెల ఈ పాటను నా తమ్ముడు బాలసుబ్రమణ్యం ని పాడమని తాను ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదని.... చివరకు ఆయన ఒత్తిడి చేయడంతో నేను ధైర్యం చేసి పాడాన‌ని.. ఆ తర్వాత ఆ పాట సూపర్ హిట్ అయిందని ఓ సందర్భంలో చెప్పారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: