ఆయన కలం పడితే అక్షరాలు పులకించి పోయేవి, తమను సాహిత్యం లో వాడుకోమ ని పదాలు ఆయనను బ్రతిమలాడేవి. ఇప్పటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆయనే సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు సినిమా సాహిత్య ప్రపంచం లో సిరివెన్నె ల ఎన్నో గొప్ప పాటలను రచించగా లక్షలాదిమంది మస్తిష్కలను ఆయన తన కలం లో వెలిగించారు. ద్వాందార్ధాలకు తన సాహిత్యంలో తావు ఇవ్వరు.

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ దానికి గగనానికి పయనమయ్యాడు. గత రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. దాంతో ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరగా అక్కడ డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన బ్రతక లేక పోయారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కమర్షియ ల్ పాటలను రాస్తూనే తనదైన కవితాత్మను తన పాటలలో నింపుకుని ప్రేక్షకులను అలరించేవారు. ఆయనకు కమర్షియల్ పాటలు రాసే అలవాటు చేసిన దర్శకులు చాలా మంది.

 వారిలో వంశీ కూడా ఒకరు. లేడీస్ టైలర్ చిత్రానికి ఆయనతో పాటలు రాయించుకుని ఆయనను స్టార్ రైటర్ చేశారని చెప్పవచ్చు. వేటూరి లా సింపుల్ గా కమర్షియ ల్ బాణీలు రాసే పరిష్కారం పెట్టి ఆ తర్వాత ఎన్నో వందల పాటలను రచించారు సిరివెన్నెల. ప్రేక్షకుల ఊహలకు తనదై న శైలిలో అక్షర రూపం ఇచ్చి అందరి నీ అబ్బుర పరిచే ఆయన నుంచి ఎన్నో గీతాలు రాసి అన్నిటినీ సింపుల్ గా మార్చి పాటలు రాయడంలో దిట్ట అయ్యారు. ఆయన కలం యొ క్క బలం ఎక్కువ అని అందరూ అంటూ అంటారు. ఆయన కలం అగ్ని ధారలు కురిపిస్తుంది. అమృతవాక్కులు కూడా అందిస్తుంది. సినిమా అంటే చీప్ భావించే చాలామంది ఈ మహాకవి  తర్వాత తమ అభిప్రాయం మార్చుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: