తెలుగు సినిమా పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కు హీరోలలో సైతం మంచి క్రేజ్ ఉంది. ఆయన తో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా భావిస్తూ ఉంటారు. తప్పకుండా తమ కెరీర్ లో ఆయన తో ఒక సినిమా చేసినా చాలు స్టార్ హీరో అవ్వడం చాలా తేలిక అని వారు భావిస్తుంటారు. ఆ విధంగా ఇప్పటి వరకు ఎంతోమంది చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత స్టార్ హీరోగా మారారు. అల్లు అర్జున్ వరుసగా త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసి త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన హీరో గా రికార్డు సృష్టించారు.

ఇకపోతే ఆయన తో సినిమాలు చేసిన వారు కూడా మళ్లీ మళ్లీ సినిమా లు చేయాలనుకోవడం విశేషం. ఇప్పుడు ఆ జాబితా లో చిరు కూడా చేరిపోయారు. ఆయనతో సినిమా చేస్తే చాలు.. ఓకే అంటే చాలు కథ కూడా ఓకే అవనవసరం లేదు తర్వాత కథను డిసైడ్ చేయొచు అనుకున్న హీరోలు ఉన్నారు అంటే త్రివిక్రమ్ ఏ రేంజ్ లో తన పాపులారిటీని కొనసాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్టీఆర్ తో సినిమానీ క్యన్సిల్ చేసుకుని ఇప్పుడు మహేష్ బాబు  28 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ భీమ్లా నాయక్ సినిమా ను పర్యవేక్షిస్తున్నారు. 

ఇలా అందరి హీరో లతో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తూ ఆయన స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే ఆయనతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయాల్సి ఉండగా కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ సినిమా త్వరలోనే సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా ఇప్పుడు మరొక వార్త అందరినీ ఎంతగానో ఆశ్చర్య పరుస్తుంది. కథ లేకుండానే మెగాస్టార్ చిరంజీవి సినిమా ను ఓకే చేశాడట. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ దగ్గరుండి చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతే షూటింగ్ కు వెళతాడు. అలాంటిది కథ లేకుండానే ఆయన సినిమా ఓకే చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: