తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా పేరు సంపాదించుకున్న తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే తుది శ్వాస విడిచారు. నిమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈనెల 25వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం అంతకంతకూ విషమిస్తూ వచ్చింది. చివరికి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలె ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.



 దశబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పాటల రచయితగా నటుడిగా ఎంతగానో సేవ చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం మాత్రం తెలుగు ప్రేక్షకులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెన్నెల మరణంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు తెలుగు ప్రేక్షకులు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపైసంతాపం తెలియజేస్తున్నారు. అయితే సిరివెన్నెల మరణంపై ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.


 దాదాపు ఆరేళ్ల నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంతే కాకుండా ఆయనకు  సగం ఊపిరితిత్తు కూడా తీసేయడం జరిగిందట. ఇక ఐదు రోజుల నుంచి ఎక్మ మిషన్  మీదనే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నట్లు డాక్టర్ తెలిపారు.  ఐదు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగానే ఉందట. ఇక చికిత్స అందించినప్పటికీ ఆయన శరీరం స్పందించకపోవడంతో పరిస్థితి విషమించింది అంటూ కిమ్స్ ఏంది భాస్కరరావు చెప్పుకొచ్చారు. దీంతో ఆయన నాలుగు గంటల 7 నిమిషాల క్రితం తుది శ్వాస విడిచారు అంటూ డాక్టర్ తెలిపారు.


నాటి హీరోల దగ్గర నుంచి నేటి హీరోల వరకు ఎంతోమంది సినిమాలకు అద్భుతమైన పాటలు అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. వేటూరి మరణం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటారు అనుకున్నా సిరివెన్నెల కూడా మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని లోటుగా మారిపోయింది. సిరివెన్నెల మరణంతో ఒక శకం ముగిసిందని అభిమానులు అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: