సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది గొప్ప గేయ రచయితలు ఉన్నారు. వారి పాట లతో సినిమా కే వన్నె తెచ్చిన గొప్ప గేయ రచయిత లు ఉన్న  సినిమా ఇండస్ట్రీ లో, తన పాట తో ఎన్నో సినిమాలకు గొప్ప క్యాతి తీసుకువచ్చిన గేయ రచయిత లలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కె  విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో గేయ రచయిత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. సిరివెన్నెల సినిమా లో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన విధాత తలపున అనే పాట కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి నంది అవార్డు కూడా దక్కింది. సిరివెన్నెల సినిమా లో విధాత తలపున పాట రాయడానికి తనకు వారం రోజుల సమయం పట్టినట్లు ఒక ఇంటర్వ్యూ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలియజేశాడు.

ఇలా రాసిన మొదటి సినిమా లోని మొదటి పాట కే నంది అవార్డు దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆ తర్వాత కూడా అనేక గొప్ప గొప్ప పాటలు రాసి ఎన్నో అవార్డు లను దక్కించుకున్నారు. సిరివెన్నెల సినిమా తో 1986 లో మొదటి నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి,  ఆ తర్వాత1987  లో శృతిలయలు, 1988 లో స్వర్ణకమలం సినిమా లకు కూడా నంది అవార్డులను అందుకున్నారు. ఇలా వరుసగా మూడు నంది అవార్డును అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ తర్వాత గాయం, శుభలగ్నం, శ్రీకారం, సింధూరం, ప్రేమ కథ, చక్రం, గమ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వంటి పలు చిత్రాల్లో పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో గొప్ప గొప్ప పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: