సినీ రంగంలో, ముఖ్యంగా తెలుగు సినీ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రత్యేకత ఒకటుంది. ఈ రంగం...విధేయులకు మాత్రమే అందలాలు లభించే రంగం. ఈ విధేయతా లక్షణం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే ఇది ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా మారుతుంది కూడా. విధేయత ప్రదర్శించడం, అలా నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకోవడం లాంటి చర్యలు సీతారామ శాస్త్రికి తెలియదు. పారితోషికం విషయంలో కాకండా, పాత్రల ప్రాధాన్యతలను అనుసరించి పాటలు రాసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సినీ రంగంలో విశ్వనాథ్ దృశ్యమైతే, సీతారామ శాస్త్రిది కావ్యం. ఇద్దరూ కలిస్తే సుమధుర దృశ్య కావ్యం అని సినీరంగ విమర్శకులు సైతం పేర్కోంటారు.
'తెల్లారి ఇంట్లో బయలు దేరింది మొదలు రాత్రి ఇంటికి వచ్చే లోగా రక రకాల ప్రెస్ మీట్లు, సక్సస్ మీట్లు, అడియో రిలీజ్ లు, ఇంటర్యూలు, ఫోటోలు, కరచాలనాలతో కడుపు నింపక పోయినా, కళ్లు నిండిపోయోంత తీరిక లేనిది - ఇవాల్టి సినీ పత్రికా రచనా జీవితం' అన్న ప్రముఖ కవి రెంటాల జయదేవ మాటలను గుర్తు చేసుకుంటూ..