ఆయన విమానంలోని బిజినెస్ క్లాస్ లో ఉన్న కొద్దిపాటి స్థలంలో కాళ్లు బార్లా చాపుకుని కూర్చున్నారు. ఆయన శరీరం మీద ఉన్న తెల్లని దుస్తులు,ఆయన హుందా తనానికి మరింత వన్నె తెచ్చాయి. మీతో కలసి నడవాలని మీ సహ రచయితలు కూడా అన్నారంటే అంత కన్నా మించిన , గొప్పదయిన, అరుదయిన ప్రశంస ఏమి ఉంటుంది ? అని  ఆయన  మంద్ర స్వరంతో అన్నారు.  ఢిల్లీ నగరం పై విమానం దిగుతున్నప్పుడు ఆయన విమానంలో నుంచి వెలుపలికి చూస్తున్నారు. పైమాటలు అంటున్నప్పుడు తెలుగు సినీ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న తెల్లజుట్టు సినీ రచయితలో ఎక్కడా ఎలాంటి భావాలు లేవు. చాలా మంది సినీ రంగ ప్రముఖులు తమ పేరు ప్రతిష్ఠలను, ఇమేజ్ ను మనసులో పెట్టుకుని ఆచిచూచి మాట్లాడటం మనం చూస్తుంటాం. ఇది అలాంటి వారిలో కనిపించే సహజ లక్షణం. అయితే  సీతారామ శాస్త్రి మాత్రం తన నిజాయితీని ప్రదర్శించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మాటలు కూడా ఆయన రచనల్లాగే నిక్కచ్చిగా ఉంటాయి ఆయన తీరు తెన్నులూ ముక్కుసూటిగా ఉంటాయి. లౌక్యంగా వ్యవహరించడం ఆయనకు తెలీదు. అవతలి వారిని ఆకట్టుకోవడం కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేయడం ఆయనకు అసలే తెలియదు.
సినీ రంగంలో, ముఖ్యంగా తెలుగు సినీ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రత్యేకత ఒకటుంది. ఈ  రంగం...విధేయులకు మాత్రమే అందలాలు లభించే రంగం. ఈ విధేయతా లక్షణం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే ఇది ఒక్కోసారి  చాలా ప్రమాదకరంగా మారుతుంది కూడా. విధేయత ప్రదర్శించడం, అలా నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకోవడం లాంటి చర్యలు సీతారామ శాస్త్రికి  తెలియదు. పారితోషికం విషయంలో కాకండా, పాత్రల ప్రాధాన్యతలను అనుసరించి పాటలు రాసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  సినీ రంగంలో విశ్వనాథ్ దృశ్యమైతే, సీతారామ శాస్త్రిది కావ్యం.  ఇద్దరూ కలిస్తే సుమధుర దృశ్య కావ్యం  అని సినీరంగ విమర్శకులు సైతం పేర్కోంటారు.

'తెల్లారి ఇంట్లో బయలు దేరింది మొదలు రాత్రి ఇంటికి వచ్చే లోగా రక రకాల ప్రెస్ మీట్లు, సక్సస్ మీట్లు,  అడియో రిలీజ్ లు,  ఇంటర్యూలు, ఫోటోలు, కరచాలనాలతో కడుపు నింపక పోయినా, కళ్లు నిండిపోయోంత తీరిక లేనిది - ఇవాల్టి సినీ పత్రికా రచనా జీవితం' అన్న ప్రముఖ కవి రెంటాల జయదేవ మాటలను గుర్తు చేసుకుంటూ..



మరింత సమాచారం తెలుసుకోండి: