తెలుగు సినిమా ప్రపంచం లోనే.. ఒక సాహిత్య సౌరభం నిన్నటి రోజున రాలిపోయింది. దీంతో తెలుగు సినీ ప్రపంచమే మూగబోయిందని చెప్పుకోవచ్చు. సిరి వెన్నెల సీతారామ శాస్త్ర.. మరణం ఈ విషయం వినగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా స్పందించడం జరిగింది.. ఈయనతోపాటు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం తో సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన కు  నివాళులు అర్పించారు. అయితే ఆయన మరణంపై కొన్ని వార్తలు రావడం జరిగింది వాటి గురించి చూద్దాం.


సిరివెన్నెల మరణంపై.. కిమ్స్ హాస్పిటల్లో ఉండేటువంటి కొంతమంది వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. సీతారామ శాస్త్రి కి కొన్ని సంవత్సరాల క్రిందటే ఉపిరితిత్తుల కు క్యాన్సర్ సోకడం జరిగిందట. అందుచేతనే ఆయనకు ఊపిరితిత్తులలో సగభాగాన్ని తీసేయడం జరిగిందని తెలియజేశారు. ఆ తర్వాత ఒక  సర్జరీ కూడా చేయించుకున్నారని తెలియజేశారు. ఇక నిమోనియా రావడంతో ఈయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలియజేశారు.



అయితే వైద్యులు తెలిపిన ప్రకారం ఆయన గత వారంలో రెండు రోజులు వరకు బాగానే ఉన్నారని. ఆ తరువాత రోజు నుంచి ఎస్మా మిసన్ పై.. చికిత్స అందిస్తున్నామని, ముందుగా ఆయనకు సోకిన క్యాన్సర్ ను తొలగించి, ఆ తరువాత ఒక సర్జరీ చేయవలసి ఉండేది. కిడ్నీలు పని చేయకపోవడం వలన.. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన మరణించారని వైద్యులు చెప్పుకొచ్చారు. వైద్యడు భాస్కర్ రావు మీడియా వారికి తెలియజేయడం జరిగింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధివదేహాన్ని.. తెలుగు ఫిలిం ఛాంబర్ కు తరలించినట్లు సమాచారం. ఈ రోజున ఆయన అభిమానులు ఆయన చివరి చూపు గా చూసుకునేందుకు అక్కడ ఉంచినట్లు తెలుస్తోంది. అటుపిమ్మట స్మశానవాటికలో ఈయన అంత్యక్రియలను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గా సమాచారం. ఇక సినీ ప్రస్థానం 1986 లో మొదలుపెట్టి 2021 లో ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: