సాహిత్య‌ప‌రంగా లాస్ట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ ఫిల్మ్‌ఛాంబ‌ర్ లోని ఆయ‌న పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించి.. సిరివెన్నెల కుటుంబ స‌భ్యుల‌ను పరామ‌ర్శించి, ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు చిరంజీవి. అనంత‌రం ఫిల్మ్‌ఛాంబ‌ర్ వ‌ద్ద సిరివెన్నెల‌తో త‌న ప్ర‌యాణాన్ని మీడియాతో పంచుకున్నారు. తాను చివ‌రి సారిగా ఫోన్ చేసిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ఇప్పుడే చెప్పార‌ని, త‌న‌తో మాట్లాడిన త‌రువాత ఫోన్ ఆఫ్ చేసి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యార‌ని వెల్ల‌డించారు.

ఫ్రొటాన్ ఆసుప‌త్రి వ‌చ్చింద‌ని అక్క‌డికి తీసుకెళ్లితే మెరుగ‌వుతుందేమోన‌ని ఫోన్ చేసాను. ఆయ‌న న‌వంబ‌ర్ నెలాఖ‌రుకు వ‌స్తాన‌ని చెప్పారు. కానీ ఈనెల చివ‌ర‌కు వ‌చ్చేస్తాను అని చెప్పారు. కానీ ఈ విధంగా వ‌స్తార‌ని నేను ఊహించలేదు. సింకు చేసుకున్నా కానీ సింకు అవ్వ‌డం లేద‌ని వెల్ల‌డించారు మెగాస్టార్‌. చివ‌రి సారిగా త‌న‌తో మాట్లాడి లేకుండా పోవ‌డం ఎంతో బాధ‌గా ఉంద‌ని పేర్కొన్నారు చిరంజీవి. ఒకే సంవ‌త్స‌రంలో పుట్టినమ‌న్న క‌నెక్ష‌న్ ఏమో.. ఎప్పుడు మిత్ర‌మా.. మిత్ర‌మా అని ఆప్యాయంగా ప‌లుక‌రించే వారు అని చెప్పారు మెగాస్టార్‌..

ముఖ్యంగా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, సిరివెన్నెల లాంటి వాళ్లు సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తార‌ని మాత్రం నేను అనుకోవ‌డం లేదు. ఎవ‌రైనా స‌రే ఆ పాట‌కు ఆపాట.. ఏపూట‌కు ఆ పూట‌.. ఇలాంటి సాహిత్య‌పు సేవ చేసే వారు ఎవ‌రు లేర‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసారు. మిత్ర‌మా నీ గురించి రాయాల్సి వ‌స్తే నాకు చాలా ఉత్సాహం ఉంటుంద‌ని చెప్పేవారు. నిన్ను ఉద్దేశించి రాసాన‌ని.. ఎవ‌రూ అయినా పుట్ట‌గానే మెగాస్టార్ అవుతార‌ని ఆయ‌న నాపై ఉన్న అభిమానాన్ని అక్షర రూపంలో రాయ‌డం అనేది గొప్ప విష‌యం అని పేర్కొన్నారు. మ‌హానుభావుడిని స్మ‌రించుకునే విధంగా క‌నీస బాధ్య‌త. ఆయ‌న‌కు అతిద‌గ్గ‌ర‌గా ఉన్న వారు ఆయ‌నను స్మ‌రించుకునే లాగా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాను. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అత్యంత క్లోజ్ అని ఆయ‌న‌తో మాట్లాడి అన్ని ఏర్పాట్ల‌ను సిద్ధం చేయ‌నున్న‌ట్టు మెగాస్టార్ వెల్ల‌డించారు.

 సిరివెన్నెల లేని లోటును ప్ర‌తీ ఒక్క‌రూ తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద‌యం  నుంచి సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా చేరుకొని సిరివెన్నెల‌కు నివాళుల‌ర్పిస్తున్నారు.  నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర‌వింద్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, రానా, రాజ‌మౌళి, ఎం.ఎం.కీర‌వాణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, గుణ‌శేఖ‌ర్‌, రావు ర‌మేష్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌ల‌తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి, సింగర్ సునీత,  ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సంగీత ద‌ర్శ‌కులు, న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు వాళ్లు వీళ్లు తేడా లేకుండా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి పార్థ‌వ‌దేహానికి నివాళుల‌ర్పిస్తూ.. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం మ‌హాప్ర‌స్థానంలో సీతారామ‌శాస్త్రి అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: