నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈనెల 24న క్రిస్మస్ కానుకగా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నాని కి ల‌క్ ఏమో గాని తెలుగు లోఆ రోజున పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో క్రిస్మస్ హాలీడేస్ తో పా టు ఆ వీకెండ్ నాని ఎంచ‌క్కా క్యాష్ చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. సినిమా కు ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా చాలు.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్లు కుమ్మేస్తుంద‌నే అంద‌రూ అంటున్నారు.

ఇక నాని న‌టించిన వీ , ట‌క్ జ‌గదీష్ సినిమాలు రెండూ కూడా ఓటీ టీ లో వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చింది. అయితే ఓ టీటీ లో రిలీజ్ కావ‌డంతో నాని ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో చూడ‌లేక‌పోయామ‌ని ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు శ్యామ్ సింగ‌రాయ థియేట‌ర్ల లో వ‌స్తుండ‌డంతో సిన‌మా కు మంచి టాక్ వ‌స్తే నాని రేంజ్‌, క్రేజ్ మ‌ళ్లీ పెరిగేలా ఉంది.

అయితే అదే రోజు బాలీవుడ్ క్రేజీ హీరో ర‌న్ వీర్ సింగ్ న‌టించిన 83 సినిమా కూడా పోటీకి వ‌స్తోంది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24నే ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా ను కేవ‌లం హిందీ లో మాత్ర‌మే కాకుండా.. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ కూడా ఆస‌క్తి రేపుతోంది.

భార‌తీయుల‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవ‌ల క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్న అన్ని సినిమాలు సూప‌ర్ హిట్ అవుతున్నాయి. ధోనీ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక 1983 లో క‌పిల్ దేవ్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు క‌ప్ కొట్టిన నాటి స్మృతుల నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ క్రికెట్ సెంటిమెంట్ ఇప్పుడు నాని సినిమాను భ‌య పెడుతోంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: