సినిమా పరిశ్రమలో ఇప్పుడు చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌మ‌స్య‌ల‌కు జ‌స్ట్ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్... అన్న‌ట్టుగా ఎవ‌రికి వారు పంతానికి పోతే ఇద్ద‌రం న‌ష్ట పోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సంక్రాంతికి వ‌స్తోన్న పెద్ద సినిమాల రిలీజ్‌.. థియేట‌ర్ల స‌మ‌స్య లు ఎలా ప‌రిష్కారం అవుతాయ‌న్న టెన్ష‌న్ అయితే ఉంది. ఇప్ప‌టికే 2022 సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల లోకి ఆర్ ఆర్ ఆర్ వ‌స్తోంది.

అయితే సంక్రాంతికే రాధే శ్యామ్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రానా కాంబోలో వ‌స్తోన్న భీమ్లా నాయ‌క్ సినిమా కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యింది. అయితే భీమ్లా నాయ‌క్ ను వాయిదా వేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా ఆ సినిమా నిర్మాత‌లు మాత్రం ఎంత‌కు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. సంక్రాంతి బ‌రిలోనే త‌మ సినిమాను ఉంచుతామ‌ని ప‌దే ప‌దే డేట్లు వేస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ఎంట్రీ ఇస్తే భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి పాన్ ఇండియా సినిమా గా వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌సూళ్ల‌కు చాలా వ‌ర‌కు గండి ప‌డుతుంద‌ని ఆ సినిమా యూనిట్ టెన్ష‌న్ లో ఉంది. పైగా ఏపీలో థియేట‌ర్ల లో ఉన్న స‌మ‌స్య‌లు, నాలుగు షోలు, టిక్కెట్ రేట్లు త‌గ్గించ‌డంతో కూడా త‌మ సినిమా వ‌సూళ్ల పై ప్ర‌భావం చూపుతుంద‌ని వాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ ను ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి కి వాయిదా వేయిస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. అయితే లే టెస్ట్ టాక్ ప్ర‌కారం రాజమౌళిని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదట‌. దీంతో రాజ‌మౌళి ఆశ‌లు అడియాస‌లు కానున్నాయి. భీమ్లా నాయ‌క్ కూడా సంక్రాంతి కే వ‌స్తే ఆ సినిమా వ‌సూళ్ల లో భారీ కోత త‌ప్ప‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: