రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన నటించిన ఆర్ఆర్ఆర్  చిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉండగా ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా యొక్క అప్డేట్ లు కూడా అంచనాలకు తగ్గట్టు గానే ఉన్నాయని చెప్పవచ్చు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని మంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు దర్శకుడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు రాజమౌళి.

సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆలోగా దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి ప్రేక్షకులందరూ థియేటర్లోకి వచ్చే విధంగా చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి వివిధ నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసాడు రాజమౌళి. మరో వైపు అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో విజయవంతం చేయాలని ఇప్పటి నుంచే వారి పనులన్నీ మానుకుని సినిమాకు పని చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు హీరోల అభిమానులు పోటాపోటీగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో వారి మధ్య పోటీ ఎలా ఉందొ మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ప్రేక్షకులు అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా మరొక వైపు చెప్పిన సమయానికి ఈ చిత్రం విడుదల అవుతుందా అని అనుమానాలు సోషల్ మీడియాలో కొన్ని వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ మిగిలి ఉందని అది తొందరలోనే పూర్తి చేసి రాజమౌళి తన సినిమా విడుదల సమయానికి రెడీ చేయాలని భావిస్తున్నాడు. అయితే వాస్తవానికి రాజమౌళి ఏ సినిమానైనా చాలా రోజులు టైం తీసుకుంటున్నాడనే పేరు ఉంది. ఈ నేపధ్యంలో ఇంత తక్కువ సమయంలో ఆయన బ్యాలెన్స్ షూట్ చేసి షూటింగ్ జనవరి 7వ తేదీ కల్లా సినిమా ప్రిపేర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అనేదే ఇక్కడ అసలు సమస్య. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు విడుదల కాగా అవి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలాచేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: