అసలే కరోనా కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ సగం చచ్చిపోయింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా వారిపై పగ పట్టినట్లుగా వ్యవహరిస్తుండడం వారికి భారీగా నష్టాలు వచ్చేలా చేస్తూ ఉండటం వంటివి చేస్తుంటే భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో అని అందరూ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే సొంత వేలితో కంట్లో పొడుచుకున్నట్లు కొంతమంది నిర్మాతల అత్యుత్సాహం వల్ల తెలుగు సినిమా పరిశ్రమ లో తెలియకుండా కొత్త నష్టం ఇప్పుడు అన్ని సినిమాలకు జరుగుతుంది.

అదేమిటంటే ఇటీవల కాలంలో హక్కుల పేరిట వివిధ భాషలలోకి సినిమాలు అమ్మడం జరుగుతున్నాయి. అలాగే కొత్తగా ఓ టీ టీ హక్కులు అనే పేరు మీద కొన్ని హక్కులను సంస్థలకు అమ్ముతున్నారు నిర్మాతలు. ఆ విధంగా సినిమా విడుదలైన నెలరోజులు తిరక్కుండానే సదరు సినిమాలు ఓ టీ టీ లో ప్రదర్శించబడటం థియేటర్లలో సినిమా సరిగ్గా అడక పోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

థియేటర్ లలో వచ్చిన తర్వాత ప్రతి సినిమా కూడా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఓ టీ టీ లో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలరించడం వరకు బాగానే ఉన్నా కూడా ఈ విధంగా నెల రోజుల వ్యవధిలోనే సినిమాలు ఓ టీ టీ లోకి రావడం పట్ల కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం పట్ల ప్రేక్షకుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుందని, నెల రోజులు ఆగితే ఓ టీ టీ వచ్చేస్తుందని వారు థియేటర్లకు రావడం మానేస్తారు. ఆ విధంగా వారు ప్రేక్షకులు థియేటర్ లోకి రాకపోతే సినిమా కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయని కూడా వారు చెబుతున్నారు. ఒక రకంగా వీరు చెప్పింది కూడా నిజమే అని అనుకోవచ్చు. అధికారికంగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తమ సినిమాల ద్వారా ప్రకటిస్తుంటే ప్రేక్షకులు థియేటర్లకు రమ్మంటే ఎందుకు వస్తారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott