తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు చలన చిత్ర సాహిత్య వెన్నెల సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో  నిన్న సాయంత్రం 4 గం. 7 ని. లకు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యల కారణంగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం తనకు ఆరోగ్యం బాగాలేదని సిరివెన్నెల తమ హాస్పిటల్ లో చేరారని, అప్పటికే న్యుమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల మంచి మెరుగైన వైద్యం అందించేందుకు అప్పటి నుండి పలువురు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ లో ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తున్నాం అని, అయితే నిన్న ఆయన పరిస్థితి మరింతగా విషమించడంతో ఆయన సాయంత్రం సమయంలో మృతి చెందారని ఆసుపత్రి డాక్టర్లు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే సిరివెన్నెల మృతితో ఒక్కసారిగా టాలీవుడ్ పరిశ్రమ మూగబోయింది. ఆయన తన కెరీర్ లో రాసిన వేలాది పాటలతో సాహితీ ప్రియుల మదిని గెలుచుకున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ఇక ఆయన తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేసారు. తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశలా వ్యాపింపచేసిన గొప్ప గేయరచయిత సిరివెన్నెల అని అన్నారు బాలయ్య. ఆయన తన సినిమాల్లో ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసారని, ముఖ్యంగా తెలుగు సినిమా పాటకు సాహిత్య గౌరవం అందించిన గొప్ప కవి సిరివెన్నెల అని అన్నారు బాలయ్య. అటువంటి గొప్ప వ్యక్తి నేడు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరం అని, ఆయన మృతికి నివాళులు తెలియచేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే ఆ భగవంతుడు వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బాలయ్య తన ప్రకటనలో తెలిపారు. సిరివెన్నెల లేని లోటు నిజంగా ఎవరూ తీర్చలేనిదని పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: