తెలుగు చిత్ర పరిశ్రమలో సిరివెన్నెల సీతారామశాస్త్రి దాదాపుగా 3000 లకు పైగా పాటలు రాయడం జరిగింది. వాస్తవానికి తొలిసారిగా జనని జన్మభూమి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయినప్పటికీ కూడా సీతారామశాస్త్రి అనంతరం కె విశ్వనాధ్ తీసిన సిరినివెన్నెల సినిమాలోని సాంగ్స్ కి తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఆ విధంగా తెలుగు సాహిత్య అభిమానుల హృదయాలను తాకిన సిరివెన్నెల అక్కడి నుండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేకమంది హీరోలకు వందలాది పాటలు రాశారు.

చిరంజీవి, బాలకృష్ణ ఇలా అప్పటి సీనియర్ స్టార్ హీరోల నుండి నేటి యువ నటులు అందరికీ కూడా సాంగ్స్ రాసి వారి వారి సినిమాల సక్సెస్ కు కారణమై అందరి నుండి మంచి పేరు అందుకున్న సిరివెన్నెల మృతి నిజంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పకతప్పదు. ఆయన మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అనే వార్త విన్న తెలుగు ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా వ్యవహరిస్తూ అందరినీ సోదర, మిత్రమా అంటూ ఆప్యాయంగా పలకరించే శాస్త్రిగారు రేపటి నుండి మన మధ్యన ఉండరు, ఇకపైన ఆయన రచించే పాటలు వినలేమా అనే విషయాన్ని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉందని అంటున్నారు సాహిత్య ప్రేమికులు.

తెలుగు పాటకు ఎంతో గౌరవం, గొప్పతనం తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకపై మన మధ్యన భౌతికంగా లేనప్పటికీ వారు రచించిన ఎన్నో వేలాది సాహిత్య ముత్యాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన మదిలోనే నిలిచి ఉంటాయని, వారి ఆత్మకి ఎక్కడ ఉన్న శాంతి కలగాలని పలువురు కోరుతూ నేడు ఫిలిం ఛాంబర్ లో ఉంచిన ఆయన పార్థివ దేహానికి పలువురు అభిమానులు, సినిమా ప్రేక్షకులు నివాళులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: