తెలుగు పరిశ్రమ దిగ్గజ సినీ గేయ రచయిత అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సుమారు 6 నెలల క్రితం సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో వైద్యులు ఆయన సగం ఊపిరితిత్తులను తొలగించారు. ఇక గత వారం రోజుల నుంచి ఆయన మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకగా.. దాంతో వాటికి ఆపరేషన్ చేసి మళ్లీ ఆ సగం ఊపిరితిత్తులను తొలగించారు. అలా డాక్టర్లు చేసిన ఆపరేషన్ తర్వాత రెండు రోజుల వరకూ ఆరోగ్యంగా ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆ తర్వాత ఆరోగ్యం విషమించడంతో మరణించారు.

 దీంతో ఈ వార్త సినీ పరిశ్రమ మొత్తానికి కలచివేసింది. సినీగేయ రచయితగా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన సినీ ప్రస్థానం కొనసాగింది. ఇక ఇదిలా ఉంటే సిరివెన్నెల తనకు నచ్చిన ఒక రచయిత గురించి ప్రస్తావిస్తూ కొన్నేళ్ల కింద ఒక సందర్భంలో ఆ రచయిత గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రతి రంగంలో అంత గొప్ప ఏమీ ఉండదని దృష్టి కోణంలో ఆలోచిస్తే కనుక తనకు విశ్వనాథ సత్యనారాయణ అంటే ఇష్టమని అన్నారు. ఇక ప్రతిభ పరంగా చూస్తే వేటూరి, సి. నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక సమకాలికుల్లో చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల తనకు ఇష్టమని పేర్కొన్నారు సిరివెన్నెల.

ఇక మరోవైపు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. ఇక ఈరోజు ఉదయం నుండి అభిమానులు సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి రానా, నాని, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, మురళీమోహన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇక జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అంత్యక్రియలు జరగనున్నాయి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: