సినిమాలో కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. హీరో-హీరోయిన్లు కానివ్వండి, డైరెక్టర్-హీరో కానివ్వండి, హీరో-విలన్ ల కాంబినేషన్ కానివ్వండి తెర పై కనిపిస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్క అని డిసైడ్ అయిపోతారు అభిమానులు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ మన తెలుగులో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను-బాలకృష్ణ, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్-అల్లు అర్జున్, రాజమౌళి-ప్రభాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి క్రేజీ కాంబో లో సినిమా వస్తే బాగుంటాయి అని అభిమాలు కోరుకుంటారు.

ఇక అలాంటి క్రేజీ హీరో-విలన్ కాంబో మళ్లి మనం తెర పై చూడవచ్చు. యస్.. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో దగ్గుబాటి వారసుడు రానా నెగిటివ్ రోల్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. హీరో గా ప్రభాస్-విలన్ గా రానా బాహుబలి సినిమాకి రెండు పిల్లర్స్ లాగా నిలబడి బాహుబలి సినిమా పేరుని ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయేలా చేసారు. ముఖ్యంగా యుద్ధం జరిగిటప్పుడు ప్రభాస్-రానా ల మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. కాగా, మళ్లీ ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యిన్నట్లు కనిపిస్తుంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పక్కన విలన్ గా రానా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత అన్నీ పాన్  ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్ .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని డైరెక్టర్  నాగ్ అశ్విన్ ఒక అద్బుతమైన సోషియో ఫాంటసీ కథను సిద్దం చేసాడని తెలుస్తుంది. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోకి సమానంగా విలన్ రోల్ ఉంటుందట. దీంతో ఈ సినిమాలో విలన్ గా బాహుబలి లో నటించిన రానా అయితే ప్రభాస్ కు ప్రతినాయకుడిగా బాగా సెట్ అవుతారని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: