టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టీజర్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రామ్ చరణ్ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ కూడా కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

ఇక ఇదిలా ఉంటే ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ ఈ స్పెషల్ సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ ని చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేశారని.. ఇక ఆ పాట షూటింగ్ చూడడానికి ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ స్పాట్ కు వచ్చారని కొరటాల శివ తెలిపారు. ఇక ఆ స్పెషల్ సాంగ్ నీ దాదాపు ఐదు రోజులు చిత్రీకరించామని.. చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ పాట చూడడానికి ఇండస్ట్రీలో చాలామంది డ్యూటీలు వేసుకొని మరి వచ్చారని తెలిపారు కొరటాల శివ. ఈ క్రమంలోనే చిరంజీవి ఫ్యామిలీ ఒకరోజు, రామ్ చరణ్ ఫ్రెండ్స్ మరో రోజు, ఇక ఆ తర్వాత దర్శకులు, నిర్మాతలు..

ఇలా ఆ అయిదు రాత్రులు ఒక జాతరలా జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇక ఆచార్య సినిమాలో ఈ సాంగ్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. ఈ స్పెషల్ సాంగ్ కి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక దీంతోపాటు ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా గ్రాండ్గా ఉండబోతున్నట్లు చెప్పారు కొరటాల శివ. ఇప్పటి వరకూ ఆచార్యను.. సిద్ధ ను సెపరేట్ గా చూపించాం అని.. ఇక ఇప్పుడు ఇద్దరిని కలిపి థియేట్రికల్ ట్రైలర్ లో చూపించబోతున్నామని పేర్కొన్నారు కొరటాల శివ. అంతేకాకుండా అన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: