టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం, రణం, రుధిరం'.యావత్ సినీ ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నారు.

 ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తగ్గడంతో త్రిబుల్ ఆర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెగ టెన్షన్ పడిపోతున్నారు. భారీ రేట్లకు త్రిబుల్ ఆర్ హక్కులను సొంతం చేసుకున్న ఏపీ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వారు కొన్న రేట్ల ప్రకారం లాభాలు వస్తాయా? రావా? అనే రీతిలో ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నెల్లూరు బయర్ నిర్మాత దానయ్యను రేటు తగ్గించమని కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అదే ఆంధ్రప్రదేశ్లోని ఇంకో బయ్యర్ కూడా రేటు కనుక తగ్గించకపోతే ఆర్ ఆర్ ఆర్ హక్కులను వదిలేస్తామని నిర్మాతకు చెప్పాడట. మరోవైపు కొత్త వైరస్ కి సంబంధించిన వార్తలు కూడా రోజు రోజుకి ఎక్కువడంతో..

 ఇవన్నీ దానయ్య తో పాటు ఇతర నిర్మాతలను కూడా బాగా టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ నిర్మాతకు ఇది కొత్త తలనొప్పిగా మారింది. ఇక ఆంద్రప్రదేశ్ లో ఒకవేళ సాధారణ పరిస్థితులు కనుక ఉండి ఉంటే కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేది. కానీ ప్రస్తుతం ఏపీలో తక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకోవాలంటే కష్టమే అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరీస్ శ్రీయా శరన్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: