రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న సినిమా రంగంలో ఎందరో నటీనటులు తమ డైన నైపుణ్యంతో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా కానీ 100 లో ఏ 10 మంది మాత్రమే అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. మిగిలిన వారంతా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో మహిళలు పురుషులు ఇద్దరూ ఉన్నారు. అయితే కొందరు మోడలింగ్ లో ఆరితేరి సినిమా హీరోయిన్ కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ నటనే ప్రధానంగా అనుకునే వారు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లి తెరపై వచ్చిన అవకాశాలను కాదనకుండా సీరియల్ హీరోయిన్ గా మారుతుంటారు.

ఇంకొందరు ఎప్పటి కైనా వెండి తెరపై హీరోయిన్ గా కనిపించాలనే ఆశతో ఎదురు చూస్తూనే ఉంటారు. కాగా చాలా మంది ఇలానే బుల్లి తెరపై హీరోయిన్లుగా వచ్చి అందం అభినయంతో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. కాగా ఓ ప్రముఖ సీరియల్ హీరోయిన్ టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. మొదట్లో అవకాశాలు కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగారు ఆ హీరోయిన్. ఇదే క్రమంలో ఓ యంగ్ హీరోతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకి ప్రేమగా మారిందట. మద్యలో సీరియల్ లో లీడ్ రోల్ చేసేందుకు గాను ఆమెకు ఛాన్స్ రావడంతో బుల్లి తెరపై అడుగు పెట్టింది. అయినా వీరి ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగుతుండటం విశేషం.

అయితే ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అని ఇండస్ట్రీలో పలువురు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరా జంట అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఆ అందాల తార చేస్తున్న ధారావాహిక  చాలా పాపులర్ సీరియల్ అని సమాచారం. పేరుకి సీరియల్ నటే అయినా ఆమెకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయని...కాకపోతే ఇప్పటి వరకు అవకాశాలు మాత్రం తెచ్చుకోలేక విఫలం అయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: