బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ - స్టార్ హీరో విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు తమ ప్రేమ‌ను దాంప‌త్య జీవితంగా మార్చు కోనున్నారు. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఒక రాజమహల్ లో వీరి పెళ్లి కి భారీ ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు అన‌ధి కారిక విష‌యాలే త‌ప్పా.. అధికారిక విష‌యాలు అయితే బ‌య‌ట‌కు రాలేదు.

ఇక ఈ పెళ్లికి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఆహ్వానాలు అందాయ‌ని అంటున్నారు. క‌త్రినా మాజీ ప్రియుడు అయిన బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు కూడా ఈ పెళ్లికి సంబంధించి ఆహ్వానం అందింద‌ని చెపుతున్నారు. స‌ల్మాన్ ఖాన్ స్వ‌యంగా క‌త్రినా పెళ్లికి వెళ్లాడంటే అంత‌కు మించిన స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయితే ఏం ఉండ‌ద‌నే అంటున్నారు.

ఇక ఈ పెళ్లికి వ‌చ్చే అతిథుల‌కు కొన్ని కండీష‌న్లు పెట్టాయ‌ని అంటున్నారు. పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌నంత జాగ్ర‌త్త లు తీసుకుంటున్నారు అట‌. ఇదే నిజం అయితే ఈ పెళ్లి ఎంత సీక్రెట్ గా జ‌రుగుతుందో తెలుస్తోంది. ఎవ్వ‌రూ కూడా గెస్ట్ లు పెళ్లి అయ్యేంత వ‌ర‌కు త‌మ ఫోన్లు కూడా వాడ‌డానికి వీళ్లే కుండా క‌ఠిన నిబంధ‌న‌లు పెట్టార‌ని అంటున్నారు.

ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయినా కూడా  ఫంక్షన్ ఎంట్రీ లో ఫోన్ ను హ్యాండవర్ చేయాల్సిందే అంటూ పెళ్లి నిర్వాహకులు ఇప్ప‌టికే ఇన్విటేష‌న్ కార్డుల్లోనే కింద మెన్ష‌న్ చేశార‌ట‌. ఏదేమైనా క‌త్రినా - విక్కీ కౌశ‌ల్ పెళ్లి ఇన్ని సంచ‌ల నాల‌కు కేంద్ర బిందువు అవుతోంది. మ‌రి ఈ జంట పెళ్లి విష‌యాన్ని ఎన్ని రోజులు సీక్రెట్ గా ఉంచుతారో ?  పెళ్లి త‌ర్వాత అయినా ఫొటోలు వారే స్వ‌యంగా రిలీజ్ చేస్తారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: