ట్రిపుల్ ఆర్ మూవీ. మూడేళ్ళుగా చిత్ర నిర్మాణం జరుపుకున్న చిత్రం. ఎన్నో ఆటంకాలు, మరెన్నో అవరోధాలు, అన్నింటికీ మించి రెండు దశల కరోనా వేళ ఈ మూవీ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి గండాలు అన్నీ దాటుకుని ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి రెడీ అయింది. డేట్ లాక్ చేసి పెట్టాక ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

ట్రిపుల్ ఆర్ మూవీని జనవరి 7న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కలెక్షన్లు విరగదీయాలీ అంటే కనుక కచ్చితంగా ఆ డేట్ మంచిది కాదేమో అని అటు ఫ్యాన్స్ ఇటు ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుచేతనంటే ఈ పాన్ ఇండియా మూవీని దాని మానాన వదిలేయాలి. అంటే కచ్చితంగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు అలా ఫ్రీగా వదిలేస్తేనే మరే సినిమా పోటీలో లేకుండా ఉంటేనే కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు.

కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. తెలుగులోనే చూసుకుంటే  జనవరి 7న ట్రిపుల్ ఆర్ వస్తే 12న భీమ్లా నాయక్ అంటే కేవలం అయిదు రోజులు మాత్రమే సోలోగా ఈ మూవీ థియేటర్లో ఉంటుంది. భీమ్లా నాయక్ వచ్చాకా థియేటర్లకు పంచుకుంటుంది. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా 14న రిలీజ్ అవుతోంది. దానికి పెద్ద ఎత్తున థియేటర్లు కావాలి. అలా కనుక చూసుకుంటే తెలుగులోనే ట్రిపుల్ ఆర్ కి థియేటర్లు తగ్గడం, భారీ పోటీ ఉండడం జరుగుతోంది. ఇక దీనికి తోడు తమిళ్ హీరో అజిత్ నటించిన మూవీ డబ్బింగ్ ఒకటి తెలుగులో పండుగకు వస్తోంది. ఇదే మూవీ తమిళ్ లో కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.

ఇలా కోలీవుడ్ లో కూడా ట్రిపుల్ ఆర్ కి గట్టి పోటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే రాధేశ్యామ్ తో పాటు బాలీవుడ్ మూవీ ఒకటి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ట్రిపుల్ ఆర్ కి పాజిటివ్ టాక్ వచ్చి ఎక్కువ రోజులు ఎక్కువ థియేటర్లలో నిలిచి ఆడితే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. బాహుబలికి అదే జరిగింది. కానీ ట్రిపుల్ ఆర్ కి మాత్రం అన్ని వైపులా పోటీయే ఉంది. అందుకే సమ్మ‌ర్ కి రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న మాట ఉన్నా కూడా ఇప్పటికే బడ్జెట్ భారీగా పెరిగింది. కరోనా పుణ్యమాని ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అయింది అందుకే ట్రిపుల్ ఆర్ ని డేరింగ్ గా జనవరి 7న థియేటర్లలోకి తెస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: