మాస్ రాజా రవితేజ ఇప్పుడు మామూలు ఫామ్ లో లేడు. ఆయన హీరోగా నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ ఎందుకు ఇంతగా సినిమాలు ఒప్పుకుంటున్నాడో తెలియదు కానీ ఇతర హీరోలు మాత్రం మాస్ రాజా వేగాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన కిలాడి చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతేకాక మరొక రెండు సినిమాలను అనౌన్స్ చేసి ఆయన అభిమానులను ఎంతగానో ఖుషీ చేశాడు.

కిలాడి చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ఆయన శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని తెరకెక్కించడం మొదలుపెట్టాడు. రవితేజ కెరీర్ లో 68వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ధమాకా అనే సినిమా కూడా అనౌన్స్ చేశాడు మాస్ రాజా. మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్న త్రినాధరావు రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఓ అద్భుతమైన కథను సిద్ధం చేయగా ఈ చిత్రం కూడా తనకు మంచి విజయాన్ని అందజేస్తుందని రవితేజ భావిస్తున్నాడు.

ఇక దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి రవితేజ ఓ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
 దాని పేరు రావణాసుర అని ప్రచారంలో ఉండగా ఇన్ని సినిమా లు ఒకేసారి తెరకెక్కించడం కేవలం రవితేజ వల్లనే సాధ్యం అని చెప్పాలి. సినిమాలు అనౌన్స్ చేయడం మాత్రమే కాదు వాటి చిత్రీకరణ విషయంలో కూడా ఫాస్ట్ గా ఉన్నాడు రవితేజ. ఇప్పటికే కిలాడి చిత్రంను విడుదలకు సిద్ధం చేసిన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. కిలాడి సినిమాను విడుదల చేసిన కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: