ప్రస్తుతం సర్కారి వారి పాట చిత్రాన్ని రిలీజ్ చేసే పనిలో ఉన్న మహేష్ బాబు ఈ చిత్రం తర్వాత తన 28 వ సినిమాను
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు మరియు
ఖలేజా వంటి సినిమాలు రాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు వీరి కాంబో లో తెరకెక్కబోయే ఈ మూడో
సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి మహేష్ తన తదుపరి సినిమాను
రాజమౌళి తో చేయాల్సి ఉండగా అనూహ్యంగా
త్రివిక్రమ్ చేతికి ఈ
సినిమా వచ్చింది.
దీని తర్వాత
రాజమౌళి సినిమా చేయాలని మహేష్ బావిస్తున్నారు. ఇకపోతే
త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళక పోవడంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహా పదుతున్నారు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అని తెగ ఆరాటపడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ
సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళ బోన్నట్లుగా తెలుస్తుంది.
సెక్స్ మీద కు వెళ్లడం తోనే మహేష్ తో ఫైట్ సీన్ చిత్రీకరించబోతున్నారట త్రివిక్రమ్.